‘లూసిఫర్’ రీమేక్ పై ఈ కన్ఫ్యూజన్ ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసీఫర్’ ను తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ‘సుజీత్.. ఈ రీమేక్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ .. చిరుకి నచ్చలేని కారణంగా ఈ ప్రాజెక్టు నుండీ అతన్ని తప్పించినట్టు కూడా ప్రచారం జరిగింది. అతని స్థానంలో వినాయక్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కూడా చిరు ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో వినాయక్ అసలు ‘లూసిఫర్’ వద్దని స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదని చిరుకి చెప్పడంతో.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు మరో వార్త కన్ఫ్యూజన్ కు తెరలేపింది. ‘లూసిఫర్’ రీమేక్ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్టు ప్రచారం మొదలైంది. ముందుగా జగపతి బాబు, రెహమాన్ వంటి వార్ల పేర్లు కూడా వినిపించాయి.వాళ్ళు ఫిక్స్ అనే విధంగా ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు సంజయ్ దత్ పేరు తెర పైకి వచ్చింది. అసలు ఈ ప్రాజెక్టు ఉండదు అని ఓ పక్క వార్తలు వస్తుంటే.. మరోపక్క విలన్ ఫిక్సయ్యాడు అంటూ ప్రచారం జరగడం.. కన్ఫ్యూజ్ చేసే విషయమే అని చెప్పాలి. కాబట్టి.. చిరంజీవి లేదా నిర్మాత రాంచరణ్ వంటి వారు ఈ విషయంలో చొరవ చేసుకుని క్లారిటీ ఇస్తేనే కానీ ఏదీ కన్ఫార్మ్ అని చెప్పలేము.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus