చరణ్ కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామా’. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ చిత్రం విడుదల కానుంది. ‘డీ.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీ.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడు గా నటిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఆడియోకు కూడా మంచి స్పందన లభించడం విశేషం. మాస్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాంచరణ్ కెరీర్లోనే ఈ చిత్రానికి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత చరణ్ హీరోగా వస్తున్న చిత్రం కాబట్టి భారీ రేట్లు పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు పంపిణీ దారులు. సంక్రాంతికి మాస్ చిత్రాలకి జనాలు క్యూలు కడతారు కాబట్టి.. ఇక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ‘వినయ విధేయ రామా’ భారీ ఓపెనింగ్స్ ను సాదిస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రం ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం: 20 కోట్లు

సీడెడ్: 15 కోట్లు

నెల్లూరు: 3.30 కోట్లు

కృష్ణ: 6 కోట్లు

గుంటూరు: 7.80 కోట్లు

వైజాగ్: 11.70 కోట్లు

ఈస్ట్ గోదావరి: 7.20 కోట్లు

వెస్ట్ గోదావరి: 5.60 కోట్లు

———————————————————————-

టోటల్ (ఏపీ & టీఎస్): 76.60 కోట్లు

——————————————————————

రెస్ట్ ఆఫ్ ఇండియా: 8.50 కోట్లు

ఓవర్సీస్: 9 కోట్లు
——————————————————————-

వరల్డ్ వైడ్ బిజినెస్: 94.10 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus