ఎప్పుడో జూలై నెలాఖరులో విడుదలవ్వాల్సిన ధనుష్ తాజా చిత్రం “విఐపి 2” కొంత లేట్ గా ఆగస్ట్ 11న తమిళంలో విడుదలైంది. పోనీ పదకొండో తారీఖున తెలుగులోనూ 3 పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి దర్శకనిర్మాతలు రిస్క్ చేయలేదనుకోవచ్చు. కానీ.. విచిత్రంగా ఆగస్ట్ 18న హిందీ వెర్షన్ ను విడుదల చేశారు కానీ తెలుగులో విడుదలకు ఎలాంటి ప్లానింగ్స్ చేయలేదు. కట్ చేస్తే.. తెలుగులో ఆగస్ట్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఇలా ప్లాన్ చేయడంతో ఎలాంటి సమస్య లేదు. కానీ.. తమిళంలోనే చాలా యావరేజ్ టాక్ తోపాటు నెగిటివ్ రివ్యూలు వచ్చిన “విఐపి 2” విషయంలో ధనుష్ టీం ఫాలో అవుతున్న స్ట్రాటజీని తప్పుబడుతున్నారు చాలా మంది.
ఇప్పటికే తమిళ వెర్షన్ తోపాటు హిందీ వెర్షన్ పైసరీ ప్రింట్స్ కూడా వచ్చేయడంతో.. తెలుగు కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇన్ని అవరోధాలను దాటుకొని మొదటి భాగమైన “రఘువరన్ బీటెక్” స్థాయిలో సీక్వెల్ “విఐపి 2” విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే ఇంకో రెండ్రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.