Sai Pallavi, Rana: అదే నిజమైతే ‘విరాటపర్వం’ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..!

Advertisement

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా పలు సార్లు డిలే అయ్యింది. ఎట్టకేలకు జూన్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి.ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. 1990 లో నక్సలైట్ లు.. పోలీసులకు మధ్య ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో జరిగే కథ ఇది. రానా ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా కనిపించబోతున్నాడు. సాయి పల్లవి వెన్నెల అనే పాత్రలో కనిపించబోతుంది. రవి- వెన్నెల మధ్య ఏర్పడే ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది అని ఈ చిత్రం స్పెషల్ షోలు చూసిన ప్రముఖులు చెబుతున్నారు.

అయితే ‘విరాట పర్వం’ మూవీకి ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది అని కూడా వినికిడి. క్లైమాక్స్ లో హీరోయిన్ సాయి పల్లవి పాత్ర చనిపోతుంది అని… . ఆమె కోసం హీరో రానా పాత్ర కూడా ప్రాణత్యాగం చేసుకుని చనిపోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వెన్నెల కోసం, ఆమె ప్రేమ కోసం రవి ఎలాంటి త్యాగం చేశాడు అనేది కథ అని రానా కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే నిజమైతే ట్రాజెడీ తో నిండుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read