సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. గతంలో వచ్చిన పుకార్లను నిజం చేస్తూ ఓటీటీ టీమ్ సేమ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. అందరూ అనుకున్నట్లు మే 21 నుండి ‘విరూపాక్ష’ సినిమా ఓటీటీ స్ట్రీమ్ మొదలవుతుంది. ఈ మేరకు టీమ్ నుండి సమాచారం వస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సినిమాల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ఒకటి. కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంయుక్త కథానాయికగా నటించంది.
‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రానుంది. మీరు చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓటీటీ టీమ్ పోస్ట్ చేసింది. థియేటర్లలో ఈ సినిమా చూసిన కొంతమంది జడుసుకున్నారు కూడా. కొన్ని సీన్స్ చిన్నగా భయపెట్టేలా ఉన్నాయని కూడా చెప్పారు. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇంతమంది విజయం అందుకుంటున్న సినిమాను ఎవరూ చూడలేదు అని టైటిల్ పెట్టారేంటి అనుకుంటున్నారా? అవును మేం చెప్పింది నిజమే.
ఈ సినిమాను (Virupaksha) తెలుగులో బాగా చూసినా.. ఇతర భాషల్లో సరైన విజయం అందుకోలేకపోయింది. పాన్ ఇండియా రిలీజ్ చేసినా సరైన రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు వాళ్లంతా ఓటీటీలో ఈ సినిమా చూస్తారేమో అనేది చూడాలి. తెలుగులోపాటు ఇతర భాషల్లో ఓటీటీ రిలీజ్ ఉండనుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథ ఇది. ఆ ఊరికి వచ్చిన ఓ జంటని… చేతబడి చేసి చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ సజీవ దహనం చేస్తారు గ్రామస్థులు.
వారు మంటల్లో కాలిపోతూ పుష్కర కాలం తర్వాత ఈ ఊరు వల్లకాడు అయిపోతుందని శపిస్తారు.వాళ్లు చెప్పినట్లుగానే 12 ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో వరుసగా చనిపోతూ ఉంటారు. దాంతో ఆ గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని ఆ ఊరు పెద్దలు తీర్మానిస్తారు. అయినా మరణాలు ఆగవు. తన తల్లితో కలసి ఆ ఊళ్లో బంధువుల ఇంటికి వచ్చిన సూర్య తిరిగి వెళ్లి.. తాను ప్రేమించిన నందిని (సంయుక్త)ని కాపాడటానికి మళ్లీ ఊళ్లోకి వస్తాడు. ఈ చావుల వెనుకున్న రహస్యాల్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడేం జరిగిది అనేదే కథ.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!