‘అజ్ఞానం భయానికి మూలం..భయం మూఢ నమ్మకానికి కారణం ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రమే అంటూ ఎన్టీఆర్ ‘ వాయిస్ ఓవర్ లో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. భయంకరమైన యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇది ఒక హార్రర్ ఎలిమెంట్స్ తో కూడిన థ్రిల్లర్ మూవీ అని ఇదివరకే కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ గ్లింప్స్ చూస్తూనే అది నిజమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ ఊరు.. అక్కడి జనాలను మూఢ నమ్మకానికి బానిసలు చేసి పాలించే ఓ స్వార్థపరుడు విలన్. ఆ జనాలు మూఢ నమ్మకానికి బానిసలై ఎదుర్కొనే సమస్యలు ఏంటి? వీళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పడ్డ జనాలు ఎవరు..
ఈ క్రమంలో హీరో ధైర్యసాహసాలు చూపించి వాళ్లను ఎలా బయట పడేశాడు అనే లైన్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ లో బి.అజ్నీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే ఎన్టీఆర్ వాయిస్ హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 21 న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!