ప్రభాస్ పెళ్లి టాపిక్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరో పెళ్లి టాపిక్ ఏదైనా ఉందా అంటే.. కచ్చితంగా అది విశాల్ పెళ్లి టాపిక్ అనే చెప్పాలి. ప్రభాస్ కంటే విశాల్ పెద్దవాడు కావడం వల్ల.. అతని పెళ్లి గురించి కూడా వార్తలు కొంచెం ఎక్కువగానే వచ్చేవి. వాస్తవానికి 2019 లోనే విశాల్ పెళ్లి చేసుకోవాలి. 2018 చివర్లో నటి అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత ఎందుకో వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం, అనీషా తర్వాత వేరే బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది.
మొత్తానికి ఇటీవల విశాల్ హీరోయిన్ సాయి ధన్సిక ని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆమె కూడా చూడటానికి చాలా పొడుగ్గా ఉండటం వల్ల.. వీరి ఈడు జోడు బాగుంది అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆగస్టు 29న వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటి హడావిడి ఏమీ జరగకపోవడంతో అది వట్టిదే అని అంతా అనుకున్నారు. అయితే ఈ జంట ఈరోజు సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని మరో సర్ప్రైజ్ ఇచ్చారు..
విశాల్ ఎంగేజ్మెంట్ పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తారు అని అంతా అనుకున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు కాబట్టి.. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు హాజరవుతారు అని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా విశాల్- సాయి ధన్సిక..ల ఎంగేజ్మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి