కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి కాంట్రోవర్సీలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. విషయం ఏంటంటే అతని కొత్త సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందట. డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు FEFSI (Film Employees Federation of South India) షూటింగ్ కి అడ్డుపడినట్టు సమాచారం. దర్శకుడు రవి అరసుతో విశాల్ గొడవపడి అతన్ని ప్రాజెక్ట్ నుండి తప్పించి.. తాను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినట్టు స్పష్టమవుతుంది.
అయితే దర్శకుడు రవి అరసు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇస్తేనే షూటింగ్ తిరిగి ప్రారంభించుకునేందుకు తాము అనుమతి ఇస్తామని, లేని పక్షంలో షూటింగ్ జరపనివ్వమని వారు తేల్చి చెప్పడంతో షూటింగ్ కు అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది.విశాల్ సినిమాలకి ఇలాంటి సమస్యలు కొత్తేమీ కాదు. గతంలో మిస్కిన్‌తో కూడా విశాల్ గొడవ పడడంతో ‘తుప్పరివాలన్ 2′(డిటెక్టివ్ 2) నుండి అతను తప్పుకున్నాడు.
దీంతో ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు రవి అరసు విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవ్వడం వల్ల ‘మకుటం’ ఆగిపోయినట్టు స్పష్టమవుతుంది. విశాల్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అతని ముక్కుసూటితనం వల్ల ఇలాంటి గొడవలు జరుగుతాయని కొందరు అంటుంటారు.ఇంకొంతమంది విశాల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే ప్రొడక్షన్ విషయంలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి.. అందరికీ ఇబ్బంది కలిగిస్తాడని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు.
అంతేకాదు విశాల్ సినిమాలకు గాను స్టాఫ్ కి పేమెంట్లు సరిగ్గా అందవు అనే కంప్లైంట్ కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. మార్కెటింగ్ టీం కూడా ఇలాగే ఇబ్బంది పడినట్టు కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది.