కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal ) నిన్న అంటే ఆదివారం నాడు తమిళనాడులో, విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ అనే ఆలయంలో జరిగిన ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీకి అతిధిగా వెళ్లారు. ఈ క్రమంలో విశాల్ వేదికపై ఉన్నవారితో సరదాగా సంభాషిస్తూ ఉన్న టైంలో సడన్ గా వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే విశాల్ కి ఫస్ట్ ఎయిడ్ అందించారు. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న మాజీ మంత్రి పొన్ముడి…
వెంటనే విశాల్‌ను హాస్పిటల్ కు తరలించారు. విశాల్ స్పృహ తప్పి పడిపోయిన విజువల్స్ ను చూస్తే.. విశాల్ మూతి పక్కకు వెళ్లిపోవడాన్ని గమనించవచ్చు. కొన్నాళ్లుగా విశాల్ ఆరోగ్యం బాలేదు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘మద గజ రాజ’ (Madha Gaja Raja) సినిమా ప్రమోషన్ ఈవెంట్లో కూడా విశాల్.. చాలా వీక్ గా కనిపించారు. ఆయన మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక నిన్నటి సంఘటన బట్టి చూస్తే.. విశాల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదు అని స్పష్టమవుతుంది.
అయితే విశాల్ టీం ఈ విషయంపై స్పందించింది. ‘విశాల్ మధ్యాహ్న సమయంలో ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నారని, అందువల్ల ఆయనకు నీరసం వచ్చి స్పృహ తప్పి పడిపోయారని, వైద్యులు విశాల్ ను పరీక్షించిన తర్వాత ‘ఆహారం టైంకి తీసుకోవడం మానొద్దు.. అందువల్లే ఇలా జరిగింది’ అని సూచించినట్టు చెప్పుకొచ్చారు విశాల్ టీం.