టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరకడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇంటర్వ్యూలలో సైతం పెళ్లి గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. అయితే ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే ప్రభాస్ పెళ్లయ్యాకే నా పెళ్లి అంటూ సరదాగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా అలా రియాక్ట్ అయిన హీరోల జాబితాలో విశాల్ (Vishal) నిలిచారు. రత్నం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న విశాల్ ప్రభాస్ పెళ్లి అవ్వగానే పెళ్లి చేసుకుంటానని పెళ్లికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నా పెళ్లికి సంబంధించిన మొదటి ఇన్విటేషన్ కూడా ప్రభాస్ కే ఇస్తానని విశాల్ చెప్పుకొచ్చారు. గతంలో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే నడిఘర్ సంఘం భవన నిర్మాణం పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అయితే సమయం వచ్చినప్పుడు విశాల్ పెళ్లికి సంబంధించిన తీపికబురు చెబుతారని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ నెల 26వ రత్నం (Rathnam) సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో విశాల్ సినిమాలేవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. రత్నం సినిమాతో అయినా విశాల్ కోరుకున్న హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. విశాల్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి విశాల్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా విశాల్ కామెంట్లు చేయడం గమనార్హం.
విశాల్ టాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే విశాల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. విశాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విశాల్ మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.