Mark Antony: మార్క్ ఆంటోని మూవీతో విశాల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విశాల్ ఒకరు కాగా ప్రేక్షకుల్లో విశాల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. విశాల్ నటించిన మార్క్ ఆంటోని మూవీ ఈ నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 15వ తేదీన రిలీజ్ కావాల్సిన పలు సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. మార్క్ ఆంటోని మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జే.సూర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం గమనార్హం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉందని సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం విశాల్ తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకోవడం గమనార్హం. విశాల్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

మార్క్ ఆంటోని (Mark Antony) మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు భారీ లాభాలను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చంద్రముఖి2, స్కంద సినిమాలు 15వ తేదీన బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకోవడం మార్క్ ఆంటోని సినిమాకు వరమవుతోంది. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

సలార్ మూవీ విడుదల వాయిదా పడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానున్న సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. సలార్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో అని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్క్ ఆంటోని సినిమాతో టాలీవుడ్ హీరో విశాల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus