హీరో విశాల్ కు కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగునాట పాపులర్ అయిన విశాల్ ఆ తరువాత ‘అభిమన్యు’, ‘డిటెక్టివ్’, ‘పందెం కోడి 2’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎక్కువగా యాక్షన్ కథలను ఎన్నుకొని ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘చక్ర’, ‘యాక్షన్’ లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో సరికొత్త కథలతో ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం ఆయన ‘డిటెక్టివ్’ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో విశాల్ స్వయంగా సినిమాను డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో హీరో ఆర్యతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు విశాల్. ‘ఎనిమీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను నిర్మించి అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు.
తాజాగా విశాల్ షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో కొందరు రౌడీలు విశాల్ పై గ్లాస్ బాటిల్స్ ను విసిరేస్తూ కనిపించారు. తృటిలో ప్రమాదం తప్పిందని.. స్టంట్ ఆర్టిస్ట్ ల తప్పేమీ లేదని.. టైమింగ్ మిస్ అయిందని.. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటివి జరుగుతుంటాయని రాసుకొచ్చారు. దేవుడి దయతో, అందరి ఆశీర్వాదాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశామని.. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా తెరకెక్కించినందుకు రవివర్మ మాస్టర్ కు థాంక్స్ చెప్పారు.
A close call,lucky escape,no fault of de stunt artist,just mistiming,mishaps do happen in action sequences,
God willing&with all blessings,back 2 shoot&successfully done fight sequence&continuing shoot @ Hyd
tks 2 RaviVarma Master 4 lovely fight sequence,will be a treat 2 watch pic.twitter.com/3wE61jjZ1U
— Vishal (@VishalKOfficial) June 18, 2021
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?