Vishal, Vijay: క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న విశాల్..!

తమిళ నటుడు విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మరోసారి సినిమా రాబోతుంది. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘మాస్టర్’ అనే సినిమా తీశారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారు. ఇందులో ఓ కీలకపాత్ర కోసం విశాల్ ను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆ ఆఫర్ ను విశాల్ రిజెక్ట్ చేశారు. దీంతో కోలీవుడ్ లో విజయ్ ఫ్యాన్స్ విశాల్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

విశాల్ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విశాల్ స్పందించారు. విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించడానికి కారణాలను వెల్లడించారు.అంతేకాదు .. వీలైతే విజయ్ ని డైరెక్ట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. విజయ్ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని.. బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ ఉండడం వలన ఈ పని చేయాల్సి వచ్చిందని అన్నారు. అంతకుమించి మరో కారణం లేదని అన్నారు.

ఫ్యూచర్ లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని.. ఏదో ఒక సమయంలో విజయ్ కి స్టోరీ నేరేట్ చేస్తానని.. అతడిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇలా విజయ్ సినిమా ఒప్పుకోకపోవడానికి గల కారణం చెబుతూనే.. విజయ్ ని డైరెక్ట్ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు.

అయినప్పటికీ విశాల్ ఒక మంచి ఛాన్స్ వదులుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో విలన్స్ ను చాలా బలంగా చూపిస్తారు. విశాల్ కోసం అనుకున్న రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus