తల్లిదండ్రులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం.. వారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతూ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ ఏడాది జనవరి 26న ఆకస్మాత్తుగా కన్నుమూశారు.. దీంతో విష్ణు ప్రియ ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది..
విష్ణు ప్రియకు అమ్మ, చెల్లి ఉన్నారు.. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే పిక్స్, వీడియోలలో వాళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.. తాజాగా అమ్మ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెతో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది విష్ణు ప్రియ..
‘అమ్మా.. హ్యాపీ బర్త్డే.. నీ ప్రేమ, ఎనర్జీని భర్తీ చేయడం ఎవరి వల్లా కాదు.. ఎప్పటికీ మాతోనే ఉంటావు.. ఐ లవ్ యూ’ అంటూ అమ్మతో కలిసున్న వీడియో షేర్ చేసింది.. అమ్మ చనిపోయినప్పటి నుండి అస్సలు యాక్టివ్గా లేనంటూ భావోద్వేగానికి గురయ్యింది విష్ణు ప్రియ.. ‘మీ అమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..