Jwala Gutta: ప్రియుడితో గుత్తా జ్వాల పెళ్లి ఫిక్స్!

ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చాలా కాలంగా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి బయటకి వెళ్లడం, ఒకరితో మరొకరు సన్నిహితంగా మెలగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. తాజాగా విష్ణు విశాల్ తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 22న పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో తాము పెళ్లి చేసుకోబోతున్నామని.. ఈ విషయాన్ని చాలా సంతోషంగా ప్రకటిస్తున్నామని అన్నారు.

తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 22న తమ పెళ్లి జరుగుతుందని తెలిపారు. ఇన్నేళ్లుగా తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు.. విష్ణు విశాల్, గుత్తా జ్వాల కలిసి ప్రకటన చేశారు. వీరిద్దరూ గతంలో మరో వ్యక్తులను పెళ్లి చేసుకొని విడాకులు పొందిన వారే కావడం గమనార్హం. గుత్తా జ్వాల గతంలో చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈమె విడాకులు తీసుకుంది.

అలానే విష్ణు విశాల్ కూడా ఏడేళ్ల క్రితం రజనీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ అబ్బాయి కూడా పుట్టాడు. కొన్నాళ్లక్రితం విష్ణు విశాల్ తన భార్యతో విడాకులు తీసుకొని గుత్తా జ్వాలతో ప్రేమాయణం సాగించాడు. ఇప్పుడు ఫైనల్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా విష్ణు విశాల్ ‘అరణ్య’ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు.


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus