Vishwak Sen: విశ్వక్ సేన్ కాంట్రవర్సియల్ కామెంట్స్!

ఎల్లప్పుడూ కాంట్రవర్సీ తో తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చే హీరోలలో ఒకడు విశ్వక్ సేన్. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న హీరో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సూపర్ హిట్ సినిమాతో మన ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్’ మరియు ‘ఆకాశవనం లో అర్జున కళ్యాణం’ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 8 వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే రీసెంట్ గా విశ్వక్ సేన్ ఇంస్టాగ్రామ్ లో ఒక హీరోని ఉద్దేశిస్తూ పెట్టిన ఒక స్టోరీ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఆయన (Vishwak Sen) మాట్లాడుతూ ‘ బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకపోతే ప్రతీ ఒక్క నాకొడుకు మన గేమ్ ని దెబ్బ తియ్యాలని చూస్తూ ఉంటాడు. నేను రీసెంట్ గా చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశాను. డిసెంబర్ 8 వ తారీఖున వస్తున్నాం, హిట్ లేదా ఫ్లాప్ అనేది మీ నిర్ణయం. ఆవేశం తో తీసుకున్న నిర్ణయం కాదు, మేము తగ్గుతున్న కొద్దీ మమల్ని మింగడానికి చూస్తున్నారు, డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాకపోతే నేను ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనను’ అంటూ విశ్వక్ సేన్ హాట్ కామెంట్స్ చేసాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus