Dhamki: ధమ్కీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్.. కానీ?

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ మరో 72 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్ గత సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు సాధించడం లేదు. మరోవైపు ఉగాది కానుకగా విడుదల కావడం దాస్ కా ధమ్కీ మూవీకి ప్లస్ అవుతుండటం గమనార్హం. నివేద పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

యూత్ కు నచ్చే కథలపై విశ్వక్ సేన్ దృష్టి పెడుతుండగా దాస్ కా ధమ్కీ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో నటించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ అందించగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ఆశాజనకంగా ఉండగా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం తన మార్కెట్ ను మించి ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

త్వరలో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. నందమూరి హీరోల సపోర్ట్ ఉండటం విశ్వక్ సేన్ కు ప్లస్ అవుతోంది. ఎన్టీఆర్ కు ఫ్యాన్ బాయ్ గా చెప్పుకునే విశ్వక్ సేన్ భవిష్యత్తులో తారక్ తో కలిసి నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విశ్వక్ సేన్ 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus