Vishwak Sen: అర్జున్ చేసిన పాత కామెంట్స్ తో మరీ విశ్వక్ సేన్ ని టార్గెట్ చేస్తున్నారు..!

Ad not loaded.

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా ‘లైలా’ (Laila) రూపొందింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఆ చిత్రం రిలీజ్ కాబోతోంది. నిజానికి మొదటి నుండి ఈ సినిమాపై బజ్ లేదు. కాకపోతే హీరో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం, ట్రైలర్లో కామెడీ కూడా ఆకట్టుకోవడం వంటివి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అలా అని ఎక్కువగా ఈ సినిమా గురించి మొదట మాట్లాడుకుంది అంటూ ఏమీ లేదు.

Vishwak Sen

ఇలాంటి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని గెస్ట్ గా తీసుకొచ్చారు. స్వయంగా నిర్మాతే ‘మా సినిమా జనాలకి ఆనడం లేదు.. చిరంజీవి (Chiranjeevi) గారు వచ్చారు కాబట్టి మా సినిమాకి మంచి ప్రమోషన్ అవుతుంది’ అంటూ అనిల్ రావిపూడిని (Anil Ravipudi)  అడ్డం పెట్టుకుని ఓపెన్ గానే చెప్పాడు. అయితే చిరంజీవి కంటే ఈ సినిమాకి పృథ్వీ రాజ్ (Prudhvi Raj) అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీ ఎక్కువ పబ్లిసిటీ తెచ్చాడు అని చెప్పాలి.

‘లైలా’ లో 30 ఇయర్స్ పృథ్వీ మేకల సత్తి అనే పాత్రను పోషించాడట. దాని గురించి చెబుతూ ‘ 150 మేకలు , 11 మేకలు’ అంటూ వైసీపీ బ్యాచ్ పై సెటైర్లు వేశాడు. దీని వల్ల ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ ను బలవంతంగా ట్రెండ్ చేసింది వైసీపీ బ్యాచ్. దీంతో విశ్వక్ సేన్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అసలు పృథ్వీ కామెంట్స్ తో సినిమాకి సంబంధం లేదు. అతను చెప్పింది అంతా అబద్ధం చెప్పాడు.

అయినా సరే ఆ ట్రెండింగ్ ఆగలేదు. తర్వాత పృథ్వీ మళ్ళీ భూతులతో వైసీపీ బ్యాచ్ ని కెలికాడు. దీంతో మళ్ళీ వైసీపీ బ్యాచ్ విశ్వక్ సేన్ ని (Vishwak Sen) టార్గెట్ చేసింది. అతని గురించి గతంలో అర్జున్ ( Arjun Sarja) చేసిన కామెంట్ల వీడియోని కూడా బయటకు తీసి రచ్చ చేస్తున్నారు. ‘లైలా’ డిజాస్టర్ అయితే కనుక ఆ క్రెడిట్ వైసీపీ బ్యాచ్..దే అని చెప్పుకునేలా ఉన్నారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి పితృ వియోగం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus