Vishwak Sen: ‘బేబీ’ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన విశ్వక్ సేన్… ట్రోలింగ్ షురూ!

ఆనంద్ దేవరకొండ , విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘బేబీ’ సినిమా జూలై 14 న రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. వర్షాలు నాన్ స్టాప్ గా కురుస్తున్నా.. ఈ సినిమా ఇప్పటికీ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా రూ.30 కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది. యూత్ ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు సాయి రాజేష్ పాల్గొని..

‘ ముందుగా ఈ కథని వేరే హీరోకి చెప్పడానికి వెళ్లాను. కానీ నేను ‘హృదయకాలేయం’ ‘కొబ్బరి మట్ట'(నిర్మాతగా) వంటి సినిమాలు తీశానని .. నన్ను చీప్ డైరెక్టర్ అని భావించి. అసలు నా కథ వినడానికి టైం ఇవ్వలేదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఆ సినిమాని రిజెక్ట్ చేసింది విశ్వక్ సేన్ అని బయటపడింది. తాజాగా అతను ‘పేక మేడలు’ అనే సినిమా టీజర్ లాంచ్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు ‘ఈ మధ్య ఓ చిన్న సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అందుకుంది.

నేను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఇలాంటి టైంలో ఒక్కోసారి కథలు వినే సమయం ఉండకపోవచ్చు. అందువల్ల కొన్ని ప్రాజెక్టులు మిస్ అవుతాయి. నేను ఆ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ అని కూడా చెప్పాను.ఆ డైరెక్టర్ చేసిన కామెంట్స్ కి మీమ్స్ వస్తుంటే నాకు బాధగా అనిపించి ఇప్పుడు చెబుతున్నాను’ అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. హీరోలు సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం తప్పు కాదు.

కానీ కథ వినకుండా అతను చీప్ డైరెక్టర్ అన్నట్టు విమర్శించడం తప్పే కదా అంటూ విశ్వక్ సేన్ పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అతనికి వివాదాలు కొత్త కాదు. కానీ వివాదాలకు అతనే ఆహ్వానం పలుకుతూ ఉంటాడు. ‘బేబీ’ లా అతని కెరీర్లో రూ.30 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన మూవీ ఒక్కటి కూడా లేదు. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు అనేది విశ్వక్ (Vishwak Sen) ఎప్పుడూ తెలుసుకుంటాడో ఏమో..!

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus