Gaami: ‘గామి’ కోసం విశ్వక్ సేన్ అందుకున్న పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు!

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గామి’ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 8 న విడుదల కాబోతోంది. చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించగా ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా 6 ఏళ్ళ క్రితం మొదలైంది. టీజర్,ట్రైలర్స్ చాలా బాగున్నాయి.

విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలని తలపించాయి. చిత్రం బృందం ఈ సినిమాని ఎంతో కష్టపడి కంప్లీట్ చేసింది. ఔట్పుట్ కూడా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ‘గామి’ అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ ఇప్పుడైతే మంచి క్రేజ్ ఉన్న హీరో, అలాగే మంచి డిమాండ్ ఉన్న హీరో. కానీ 6 ఏళ్ళ క్రితం.. అంటే ఈ సినిమా మొదలుపెట్టే టైంకి అతనికి ఎలాంటి ఇమేజ్ లేదు.

అలాంటప్పుడు ‘గామి’ (Gaami) కోసం అతను ఎంత పారితోషికం అందుకుని ఉంటాడు..? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘గామి’ కోసం విశ్వక్ సేన్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ గా తీసుకోలేదట. క్రౌడ్ ఫండింగ్ మీద కంప్లీట్ చేసిన మూవీ ఇది.దాన్ని అర్థం చేసుకుని, ఎంతో నమ్మి ఈ సినిమా కంప్లీట్ చేశాడట విశ్వక్ సేన్.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus