2017 లో వచ్చిన ‘వెళ్లిపోమాకే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్.తరువాత వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టి.. క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవలె’ రిమేక్ లో నటించడానికి విశ్వక్ సేన్ ఓకే చెప్పాడట. అగ్ర నిర్మాత పివిపి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.ముందుగా ఆయన ఈ చిత్రాన్ని అఖిల్ తో చెయ్యాలని అనుకున్నారు.
కానీ అఖిల్ ఈ కథను రిజెక్ట్ చెయ్యడంతో విశ్వక్ సేన్ ను సంప్రదించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. తక్కువ బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్మాత పివిపి భావిస్తున్నారట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే డైలాగ్ రైటర్ గా మాత్రం ‘పెళ్ళి చూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే బాగుంటుందని హీరో విశ్వక్ సేన్.. నిర్మాత పివిపికి సూచించాడట.
దీనికి తరుణ్ భాస్కర్ కూడా ఓకే చెప్పేసి.. ఈ రీమేక్ కు డైలాగ్స్ రాయడం కూడా మొదలుపెట్టేశాడట. గతంలో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లు ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ వంటి చిత్రాలకు కలిసి పనిచేసారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా..! అందుకే తరుణ్ ను.. విశ్వక్ రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ‘ఓ మై కడవలె’ రిమేక్ తరువాత విక్టరీ వెంకటేష్ తో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడానికి కూడా తరుణ్ భాస్కర్ రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తుంది.
Most Recommended Video
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!