Vishwambhara Teaser: కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో విశ్వంభర టీజర్.. ఆ షాట్ సూపర్!

చిరంజీవి  (Chiranjeevi)  హీరోగా మల్లిడి వశిష్ట  (Mallidi Vasishta)   డైరెక్షన్ లో తెరకెక్కిన విశ్వంభర (Vishwambhara) మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ టీజర్ ఉండగా రెక్కల గుర్రంపై చిరంజీవి వస్తున్న షాట్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. బింబిసార (Bimbisara) సినిమాతో హిట్ అందుకున్న మల్లిడి వశిష్ట ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

Vishwambhara

టీజర్ లో చిరంజీవి కనిపించింది కొన్ని సెకన్లే అయినా చిరంజీవి లుక్స్ విషయంలో పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర టీజర్ కు కీరవాణి  (M. M. Keeravani) బీజీఎం హైలెట్ గా నిలిచింది. యూవీ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర వీర తాండవం మొదలైందంటూ చిరంజీవి అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ ఇంకా బెటర్ చేయొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. గేమ్ ఛేంజర్ (Game Changer) సంక్రాంతికి రిలీజ్ కానుందని అధికారికంగా క్లారిటీ రావడంతో విశ్వంభర సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

విశ్వంభర కథ, కథనం ఊహించని విధంగా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో కనిపించిన పాప చెవులు వింతగా ఉండటం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచడంలో మల్లిడి వశిష్ట సక్సెస్ అయ్యారు. టీజర్ లో చిరంజీవికి డైలాగ్స్ ఉండి ఉంటే బాగుండేది. చిరంజీవి ఫ్యాన్స్ కోరుకునే బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus