ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త హేమంత్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని నజరత్ పేట పోలీసులు హేమంత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9న వీజే చిత్ర చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో సూసైడ్ చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడేలా ఆమె భర్త హేమంత్ కుమార్ వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. సీరియళ్లతో పాటు ఒకట్రెండు తమిళ సినిమాల్లో చిత్ర అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడంతో హేమంత్ ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
ఆత్మహత్యకి పాల్పడిన రోజు చిత్ర, హేమంత్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుదర్శన్ తెలిపారు. ఈవీపీ ఫిలిం సిటీలో షూటింగ్ ను ముగించుకొని హోటల్ కి చేరుకున్న చిత్ర చివరి ఫోన్ కాల్ ను హేమంత్ కి చేశారని వివరించారు. మొదట ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో హేమంత్ కి చిత్రకి మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు ఉండడం లేదని తేలింది. రెండుసార్లు పోలీసులు హేమంత్ ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏసీపీ సుదర్శన్ చెప్పారు. కొంతకాలంగా తాను చిత్రతో సన్నిహితంగా ఉండడం లేదని హేమంత్ అంగీకరించినట్లు చెప్పారు. హేమంత్ పెట్టిన ఒత్తిడి, మానసిక క్షోభ వలనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారించామని ఏసీపీ చెప్పారు. ఈ కారణంతోనే అతడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!