Vv Vinayak: ‘చెన్నకేశవ రెడ్డి’ విషయంలో వినాయక్ చేసిన తప్పు అదేనట..!

  • August 22, 2022 / 11:44 PM IST

ఫ్యాక్షన్ సినిమాల విషయంలో బాలయ్య బాబుని ఓ ట్రెండ్ సెట్టర్ గా భావిస్తుంటారు. ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ సినిమాలకు ముందు కూడా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీ హిట్లు కొట్టింది మాత్రం బాలయ్య సినిమాలే.! ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు కావడంతో ఆ తర్వాత వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ కి భారీ హైప్ ఏర్పడింది.

అప్పటికే ఎన్టీఆర్ తో ‘ఆది’ అనే ఫ్యాక్షన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వి.వి.వినాయక్ దర్శకుడు.అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ బాలయ్య అభిమానులకు ఈ మూవీని ఓ కల్ట్ క్లాసిక్ గా భావిస్తారు. అభిమానులనే కాదు ఇంకొంత మంది ప్రేక్షకులు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా సాధించిన రిజల్ట్ పట్ల సంతృప్తిగా చెందరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా..!

అయితే ఈ మూవీ విషయంలో ఓ తప్పు చేశాను అని దర్శకుడు వి.వి.వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా విషయంలో నేను పరుచూరి వెంకటేశ్వర రావు గారితో ట్రావెల్ అయ్యాను. నిజానికి నేను పరుచూరి గోపాల కృష్ణ గారితో ట్రావెల్ అవ్వాలి. కానీ అప్పట్లో ఆయనతో నాకు పరిచయం లేదు.వెంకటేశ్వర రావు నాకు బాగా క్లోజ్. అందుకే ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను. కానీ ‘చెన్నకేశవరెడ్డి’ గోపాల కృష్ణ గారి బ్రాండ్ సినిమా.

మాస్ సినిమాలకు ఆయన ఇన్పుట్స్ తీసుకోవాలి. ఆయన కనుక ‘చెన్నకేశవరెడ్డి’ లో భాగం అయ్యుంటే ఫలితం మరోలా ఉండేది” అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు. నిజమే… ఎక్కువగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాస్ సినిమాలకు పని చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర రావు గారు క్లాస్ సినిమాలకు పని చేస్తూ ఉంటారు. ‘కలిసుందాం రా’ వంటి సినిమాలకు వెంకటేశ్వర రావు గారు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇండస్ట్రీ హిట్లు కూడా అయ్యాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!


తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus