Jr NTR: ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ చేయాలనుకున్నా.. మాస్ డైరెక్టర్ కామెంట్స్!

‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో ఇండస్ట్రీలో తన తొలి సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. అయితే తనలో మాస్ హీరోని మాత్రం బయటకు తీసుకొచ్చింది దర్శకుడు వివి వినాయక్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆది’ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నిజానికి ఈ సినిమాకి బదులుగా ఎన్టీఆర్ తో ఓ లవ్ స్టోరీ తీయాలనుకున్నారట వినాయక్. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలు చెప్పారాయన.

‘ఆది’ సినిమాకి ముందు ‘శ్రీ’ అనే ప్రేమకథను రాసుకున్నారట వినాయక్. ముప్పై, నలభై లక్షల బడ్జెట్ లో ఈ సినిమాను తీయాలనుకున్నారట. ఇందులో కొత్త హీరో, హీరోయిన్లకు అవకాశం ఉండడంతో నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్ ని కలిశారట వినాయక్. నిజానికి ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమా చేసే ఉద్దేశం లేదని గుర్తుచేసుకున్నారు. అయితే తను ఇంట్రడక్షన్ చెప్పిన వెంటనే నచ్చి పూర్తి కథను విన్నారని.. 20 నిమిషాలే టైం ఉందని చెప్పిన మనిషి రెండు గంటల పాటు తన కథ విన్నారని చెప్పుకొచ్చారు వినాయక్.

అంతా ఓకే అనుకొని సినిమా చేద్దామనుకునే సమయానికి కొడాలి నాని అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడని.. ఈ ప్రేమ కథలు వద్దని చెప్పి ఎన్టీఆర్ ని కన్విన్స్ చేశాడని.. ఆ దర్శకుడితో మనకెందుకులే అని కూడా అన్నాడని చెప్పుకొచ్చారు వినాయక్. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారని.. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ ఇస్తే వేరే కథ చెప్తా..

నచ్చకపోతే వద్దు అని చెప్పానని గుర్తుచేసుకున్నారు వినాయక్. అప్పుడే ‘ఆది’ స్టోరీ చెప్పానని.. దెబ్బకి అందరూ షాకయ్యారని.. రెండే రోజుల్లో కథ రాశానని తెలిపారు. కానీ ‘శ్రీ’ స్టోరీ రాయడం కోసం మాత్రం చాలా ఏళ్ల సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus