Vv Vinayak: చెన్నకేశవరెడ్డి మూవీకి వినాయక్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన వివి వినాయక్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వినాయక్ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ను పూర్తి చేయగా ఆ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఒక సందర్భంలో వివి వినాయక్ తన రెమ్యునరేషన్ కు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో నేనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వాడినని వినాయక్ చెప్పుకొచ్చారు. చెన్నకేశవరెడ్డి సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానని వినాయక్ చెప్పుకొచ్చారు. ఇండియాలో అప్పట్లో ఏ దర్శకుడు తీసుకోని స్థాయిలో తనకు పారితోషికం దక్కిందని వినాయక్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఛత్రపతి రీమేక్ తో ఈ దర్శకుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది. వినాయక్ ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు పది కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఛత్రపతి రీమేక్ హిందీలో సక్సెస్ సాధిస్తే వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో వినాయక్ బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు వినాయక్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ హీరోలతో వినాయక్ సినిమాలను తెరకెక్కించాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు వినాయక్ తన రేంజ్ అంతకంతకూ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెరీర్ విషయంలో వినాయక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డైరెక్టర్ వివి వినాయక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus