Vv Vinayak, Puri Jagannadh: పూరిపై వినాయక్‌ కామెంట్స్‌ వైరల్‌!

పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరోలు ఎంత రెబల్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి పూరిని, అతని యాటిట్యూడ్‌ని చూస్తుంటే.. హీరోల్లో అతనే కనిపిస్తుంటాడు అని అనిపిస్తుంటుంది. అలాంటి హీరో క్యారెక్టర్‌ ఉన్న పూరి జగన్నాథ్‌ పరాజయాలకు కుంగిపోతారా? అంటే కాదనే చెప్పాలి. ఈ మాట మేం అనడమే కాదు… అతని సహోధ్యాయుడు, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ కూడా ఇంచుమించు ఇలానే చెప్పారు. ‘లైగర్‌’ ఫలితం నేపథ్యంలో పూరి బాగా లో అయ్యారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వినాయక్‌ మాటలు జగన్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇస్తాయి అని చెప్పొచ్చు.

‘లైగర్‌’ సినిమా పరాజయంతో పూరి జగన్నాథ్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తున్న వార్తలపై వి.వి.వినాయక్‌ స్పందించారు. గతంలోనూ పూరి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడని, ‘పోకిరి’తో సూపర్‌హిట్‌ అందుకున్నాడని వినయ్‌ గుర్తు చేశారు. పూరి సామర్థ్యం అతని సన్నిహితులకు మాత్రమే బాగా తెలుసని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం లేని పోని వార్తలు సృష్టిస్తున్నారు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘లైగర్‌’ సినిమా ఫలితం వల్ల పూరి జగన్నాథ్‌ జీవితం ఏమీ మారదు. గతంలో ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌, సూపర్‌ హిట్స్‌ చూశాడతను. ప్రతిసారి ఫ్లాప్‌ వచ్చినప్పుడు ఇక పూరి పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. ఎందుకంటే అతనికి ఆ సత్తా ఉంది. సినిమా నిర్మాణం అన్నాక ఆర్థికపరమైన ఇబ్బందులు సహజం. దానికి పూరి ముందే సిద్ధంగా ఉంటాడు’’ అంటూ పూరి జగన్నాథ్‌ గురించి చెప్పే ప్రయత్నం చేశారు వినాయక్‌.

‘లైగర్‌’ సినిమా వల్ల ఎంత పోయింది? ఎంత వచ్చింది?అనేది పూరికి తెలిసే ఉంటాయి. పోయినదాన్ని తిరిగి పొందలేనంత అసమర్థుడేమి కాదు అని నా అభిప్రాయం. మళ్లీ వస్తాడు.. హిట్‌కొడతాడు. లేకపోతే అతను పూరి అవ్వడు కదా. అతని నుండి వచ్చిన సినిమాలు ఫ్లాప్‌ అయితే ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. కానీ పూరి అలా కాదు. పోయిన సినిమా గురించే ఆలోచించుకుని మనసును పాడు చేసుకోడు. మళ్లీ ఎలాంటి సినిమా ఇవ్వాలి అని ఆలోచిస్తాడు’’ అంటూ పూరి మైండ్‌ సెట్‌ చెప్పారు వినాయక్‌.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus