‘రెబల్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపిన వినాయక్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పీడకల లాంటి సినిమాని ఇచ్చాడు దర్శకుడు లారెన్స్. అప్పటికి ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న ప్రభాస్ నుండీ ‘రెబల్’ వంటి సినిమాని ఆయన అభిమానులు అస్సలు ఊహించలేదు. ఈ చిత్రం ప్లాప్ అవ్వడం అలా ఉంచితే.. మంచి టైటిల్ కు జస్టిఫికేషన్ లేకుండా చేసేసాడు లారెన్స్ అని ప్రభాస్ అభిమానులు ఎక్కువ ఫీల్ అయ్యారు. అయితే లారెన్స్ కంటే ముందు..

‘రెబల్’ ను మాస్ డైరెక్టర్ వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ప్రభాస్ తో వినాయక్ తెరకెక్కించిన ‘యోగి’ చిత్రం ప్లాప్ అయినప్పటికీ.. అభిమానులు మాత్రం అంత నిరుత్సాహం చెందలేదు. ఎందుకంటే ఆ చిత్రంలో ప్రభాస్ ను ఓ రేంజ్లో ప్రెజెంట్ చేసాడు వినాయక్. మళ్ళీ ఇప్పటి వరకూ ఏ దర్శకుడు అంతలా ప్రభాస్ ను చూపించలేదు అనేది వాస్తవం. ఇదిలా ఉంటే ..’ ‘రెబల్’ ప్రాజెక్టు నుండీ నిజంగానే వినాయక్ తప్పుకున్నారా?’ అని ఓ సందర్భంలో ఆయన్నే అడిగితే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని ప్రభా అని పిలుస్తుంటాను. ‘యోగి’ విడుదలకు దగ్గరవుతున్న టైములో నేను ఓ ఇంటర్వ్యూలో ‘రెబల్’ అనే టైటిల్ పెట్టి ప్రభాస్ తో ఓ సినిమా చేస్తే అదిరిపోద్ది అన్నాను. అంతే.. ఇక ప్రభాస్ తో ‘రెబల్’ సినిమా నేనే చేస్తున్నాను అని ప్రచారం మొదలైంది. కచ్చితంగా ప్రభాస్ తో ఓ సినిమా చెయ్యాలని ఉంది. సరైన స్క్రిప్ట్ దొరికితే వెంటనే నేను రెడీ’ అంటూ చెప్పుకొచ్చాడు వినాయక్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus