బాలకృష్ణ హ్యాండ్ ఇస్తే.. వెంకీ ఛాన్స్ ఇచ్చాడు..?

మాస్ చిత్రాల డైరెక్టర్ వి వి వినాయక్ గత కొంత కాలంగా సరైన హిట్ సాధించలేకపోతున్నాడు. ‘అఖిల్’ ‘ఇంటిలిజెంట్’ వంటి డిజాస్టర్స్ తో రేస్ లో వెనుకబడిపోయాడు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ… అది పూర్తిగా మెగాస్టార్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. అందులోనూ అది రీమేక్ చిత్రం కావడం గమనార్హం.

తన రొటీన్ కథలకు హీరోలు బొత్తిగా మొహం చాటేస్తున్నారు. ఇక ‘ఎన్టీఆర్-బయోపిక్’ చిత్రం తరువాత నందమూరి బాలకృష్ణతో ఓ చిత్రాన్ని చేయాలనీ భావించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ పరవాలేధనిపించింది. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణను ఎలివేట్ చేసిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈసారి బాలయ్యతో మంచి మాస్ హిట్ సాధించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశించాడు వినాయక్. అయితే ఇప్పుడు  గతంలో వెంకటేష్ తో ‘లక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ ఇచ్చాడు.. వినాయక్. ఇందులో వెంకటేష్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి.. ఫామిలీ హీరోని.. మాస్ హీరోగా కూడా ప్రెజెంట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. మళ్ళీ దాదాపు 13 ఏళ్ళ తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వనుండడం విశేషం. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus