అదేదో సినిమాలో ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని డైలాగ్ చెప్పినట్లు… ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కారణం వచ్చి సినిమా వచ్చినట్లుగా వెనక్కి వెళ్లిపోతుండటమే. చిన్నగా హిట్ టాక్ వినిపిస్తున్న సినిమాలు కూడా వీకెండ్ వసూళ్లతో సరిపెట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సరైన హిట్ చూసి చాలా రోజులైంది. దీంతో బాక్సాఫీసు దిగాలుగా మారింది. ఎవరొస్తే ఏంటి రెండు, మూడు రోజులే కదా అంటునుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెలాఖరు వరకు పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి.
అయితే అందులో పేరు మోసిన చిత్రాల సంఖ్య మాత్రం చాలా తక్కువ. రాజ్ తరున్ ‘అనుభవించు రాజా’ ఒక్కటే కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. అది కూడా నవంబరు 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం మాత్రం ఒక్కటంటే ఒక్కటి పేరున్న సినిమా రావడం లేదు. చిన్న సినిమాలను కట్టగట్టి విడుదల చేసేస్తున్నారు. దీంతో ఈ వారం బాక్సాఫీసుకి మళ్లీ బోర్ కొడుతుంది. థియేటర్లకు రావడానికి ఇప్పుడిప్పుడు ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి సినిమాలు వస్తే వారికి ఆసక్తి ఉండదు.
కాబట్టి మంచి, మంచి సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు నిండుతాయి. టాలీవుడ్ లాభపడుతంది. అయితే నవంబరులో ఎప్పుడూ ఆఫ్ సీజనే. కానీ కరోనాతో సీజన్లన్నీ పోయాయి. సినిమాలు విడుదల చేసుకోవచ్చు. కానీ మన పెద్ద సినిమాల నిర్మాతలు డిసెంబరు నుండి మొదలుపెడుతున్నారు. కాబట్టి వచ్చే నెల అయినా బాక్సాఫీసును బిజీ చేయాలి.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!