మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.. ‘మాస్ మహారాజా’ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్‌గా నటించగా.. కేథరిన్ ట్రెసా ఆయన భార్యగా కనిపించింది.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ అయింది..
ఇన్నాళ్లు చిరు నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ మిస్ అయిన కామెడీ, డ్యాన్స్ అన్నిటితో వీరయ్య మూవీ పండక్కి పిండి వంటలు పెట్టింది.. చిరు చరిష్మా, ఈజ్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదసలు.. అన్నదమ్ముళ్ల సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకాభిమానులను అలరించాయి.. ఫలితం బొమ్మ బ్లాక్ బస్టర్.. రూ. 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేసి.. 50 రోజుల దిశగా దూసుకెళ్తోంది.. చిరు – శృతిల కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి..
ఫిబ్రవరి 27 నుంచి ‘వాల్తేరు వీరయ్య’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.. ఓటీటీ రిలీజ్ కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. రీసెంట్‌గా ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ట్రాక్ విడుదల చేశారు.. ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ముందు వచ్చే ఈ టైటిల్ ట్రాక్‌లో మలేషియాలో చిరు, బాబీ సింహాను వెంటాడుతూ.. ఏనుగు ఎక్కి అతడిని చంపే సీన్ థియేటర్లలో విజిల్స్ వేయించింది.. సాంగ్ కూడా సాలిడ్‌గా ఉంటుంది..
చిరు, సింహాను చంపిన తర్వాత.. ‘సీతా పతీ.. వీడి చావు మీ కథకి ముగింపు.. నా కథకి ఆరంభం’ అంటూ ట్విస్టుతో కూడిన డైలాగ్ చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ సెల్యూట్ చేయడం.. ‘పూనకాలు లోడింగ్’ అంటూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకాభిమానులకు థ్రిల్ కలిగించింది.. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ‘వాల్తేరు వీరయ్య’..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?