Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మూవీ టీఆర్పీ తగ్గడానికి అసలు రీజన్లు ఇవేనా?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ ను మెప్పించిన సినిమాలలో ఒకటి కాగా ఈ సినిమా బుల్లితెరపై దసరా కానుకగా ప్రసారమైంది. అయితే తాజాగా వెలువడిన వాల్తేరు వీరయ్య రేటింగ్స్ మెగా ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. ఈ సినిమా అర్బన్ + రూరల్ రేటింగ్ కేవలం 4.56 కాగా చిరంజీవి సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఏంటని ఫ్యాన్స్ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా అర్బన్ రేటింగ్ కేవలం 5.14 కాగా వాల్తేరు వీరయ్య మూవీ టీఆర్పీ తగ్గడానికి అసలు రీజన్లు ఇవేనంటూ కొన్ని కారణాలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు రిలీజైన 50 రోజుల తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతుండగా వాల్తేరు వీరయ్య మాత్రం ఏకంగా 9 నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారం కావడం ఈ సినిమాకు నెగిటివ్ అయిందని మరి కొందరు చెబుతున్నారు.

ఈ సినిమాను (Waltair Veerayya) త్వరగా ప్రసారం చేసి ఉంటే మాత్రం ఈ సినిమాకు బెటర్ రేటింగ్స్ వచ్చేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ విశ్వంబర అని త్వరలో అధికారికంగా ఈ విషయాలను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. చిరంజీవికి జోడీగా నటించే ఐదుగురు హీరోయిన్లు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

ఈ హీరోయిన్లలో అనుష్క ఒక హీరోయిన్ గా ఫైనల్ కాగా మిగతా హీరోయిన్లు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. గతంలో స్టాలిన్ సినిమాలో చిరంజీవి అనుష్క కాంబోలో ఒక సాంగ్ వచ్చింది. ఈ కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. చిరంజీవి అనుష్క కాంబినేషన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాంబినేషన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus