Chiranjeevi: ఫారెన్ లో ‘వాల్తేర్ వీరయ్య’ హంగామా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. మరో స‌ర్‌ప్రైజ్ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా రెండు పాటల నిమిత్తం ‘వాల్తేర్ వీరయ్య’ టీమ్ ఫ్రాన్స్ కి వెళ్తోంది.

డిసెంబర్ 1న చిరంజీవి ఫ్రాన్స్ లో ఉంటారు. అక్కడ ఓ పదిరోజుల పాటు షూటింగ్ జరగనుంది. తిరిగొచ్చిన తరువాత ప్యాచ్ వర్క్ పూర్తి చేయనున్నారు. డిసెంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండడంతో ప్రమోషన్స్ గట్టిగా చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన షూటింగ్ మొత్తం ఎప్పుడో పూర్తయిపోయింది.

కథ ప్రకారం.. చిరంజీవి, రవితేజ సవతి సోదరులుగా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. స్టోరీ పాతదే అయినా.. ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

రవితేజ సరసన నివేతా పేతురాజ్ జంటగా నటిస్తోంది. బాబీ సింహా, కేథరిన్ ట్రెసా లాంటి స్టార్స్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus