Waltair Veerayya: ప్రీ రిలీజ్ కు ముందే వీరయ్య ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోనే విడుదలవుతుందని అభిమానులు భావించారు. అయితే ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ నిర్ణయం మారిందని సమాచారం అందుతోంది. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా 8వ తేదీన ఈ సినిమా ఈవెంట్ జరగనుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ఈవెంట్ గ్రాండ్ గానే జరగనుందని భారీ స్థాయిలో అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. మెగా అభిమానులు వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని ఏ విధంగా చూడాలని అనుకున్నామో ఆయన అదే విధంగా కనిపించనున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చిరంజీవి రవితేజ కాంబో సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ తోనే వాల్తేరు వీరయ్య మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో క్లారిటీ వచ్చిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీలో శృతి హాసన్ ఒక హీరోయిన్ గా నటించగా కేథరిన్ మరో హీరోయిన్ గా నటించారు. 67 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సాంగ్స్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus