యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో ‘వార్ 2’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. హిందీలో ఈ చిత్రం బాగానే అడుగుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రాన్ని ఆదరించడం లేదు. బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ అయితే రోజు రోజుకీ తగ్గుతూనే వస్తుంది.
నిన్న అంటే మొదటి సోమవారం రోజున చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏ ఒక్క ఏరియాలో కూడా కనీసం 50 శాతం ఆక్యుపెన్సీలు లేవు. ఇదిలా ఉంటే.. మరోపక్క తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన నిర్మాత నాగవంశీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే ఎన్టీఆర్ విలువైన సమయాన్ని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ వృధా చేసిందని, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ను సరిగ్గా డిజైన్ చేయలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ‘వార్ 2’ కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ మొదట అంగీకరించలేదట. ఆదిత్య చోప్రా కొన్ని మార్పులతో ఎన్టీఆర్ ని కన్విన్స్ చేశారట. అయినప్పటికీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పాత్ర చనిపోవాలి. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం ఆ క్లైమాక్స్ మారిస్తేనే చేస్తాను అని చెప్పాడట. తన పాత్ర చనిపోవడం అనేది తన ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు నచ్చదు అని ఎన్టీఆర్.. ఆదిత్య చోప్రాకి చెప్పడం జరిగిందట. దీంతో అతను క్లైమాక్స్ మార్చక తప్పలేదు అని తెలుస్తుంది.
గతంలో ‘డర్’ సినిమా విషయంలో కూడా షారుఖ్ ఖాన్ కోసం ఆదిత్య చోప్రా ఇలా చేయాల్సి వచ్చింది. దాని ఫలితం విషయంలో హీరో సన్నీ డియోల్ ఇప్పటికీ అసంతృప్తితోనే ఉంటారట.