యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2015 లో వచ్చిన ‘టెంపర్’ నుండి అతనికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే అతను కథల విషయంలో ఎంత పగడ్బందీగా వ్యవహరిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేశాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఆ ‘మిత్’ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసి ‘దేవర’ తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ‘వార్ 2’ లో చేశాడు.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు మరో హీరోగా నటించాడు ఎన్టీఆర్. టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేశాడని అనిపిస్తుంది. స్టార్ హీరోగా రాణిస్తున్న టైంలో ఇలాంటి రిస్క్ ఎలా చేశాడు? అనే క్వశ్చన్ మార్క్ తోనే ‘వార్ 2’పై ఆసక్తి పెంచుకున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ఫలితంపై పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏకంగా రెండు వైపులా కాలర్ ఎత్తి మరీ తన కాన్ఫిడెన్స్ ను చాటుకున్నాడు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాని ఆల్రెడీ టాలీవుడ్ కి చెందిన కొంతమంది సన్నిహితులకు నిర్మాత నాగవంశీ చూపించడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ‘వార్’ చూడని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా ‘వార్ 2’ కథ ఉందని అంటున్నారు. హృతిక్ రోషన్ ఎంట్రీ నుండే కథ మొదలవుతుందట. ఎన్టీఆర్ ఎంట్రీ ఆల్మోస్ట్ అరగంట తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎమోషన్ కి కూడా పెద్ద పీట వేశారట.
ఎన్టీఆర్ పాత్రకు పెట్టిన బ్యాక్ స్టోరీ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించని విధంగా డిజైన్ చేశారట.ట్విస్టులు ఉంటాయట.బరువెక్కిన గుండెతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వస్తారని అంటున్నారు.