మరికొన్ని గంటల్లో ‘వార్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ కి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత చేసిన ‘దేవర’ చిత్రం మాత్రం అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సో బాలీవుడ్లో ఎన్టీఆర్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా కనిపించలేదు.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ఇక్కడ ప్లాప్ అయినా హిందీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ ‘పుష్ప 2’ సినిమాలతో హిందీలో స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఎన్టీఆర్, రాంచరణ్ బాలీవుడ్లో తమ మార్కెట్ ను పెంచుకోలేకపోయారు అనే చెప్పాలి. అందుకే ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేశాడు.
హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా ఉన్నాడు కాబట్టి.. నార్త్ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం కష్టమేమీ కాదు. ఎన్టీఆర్ తన నటనతో కనుక ఇంప్రెస్ చేస్తే.. బాలీవుడ్ ఆడియన్స్ మరింత ఓన్ చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చే సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే ఎన్టీఆర్ మరో సినిమా చేస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ‘వార్ 2’ కనుక హిట్ అయితే కచ్చితంగా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో ‘వార్ 2’ సక్సెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ కి చాలా కీలకం అనే చెప్పాలి