‘పుష్ప 2: ది రూల్’ తో భారీ సక్సెస్ అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ కొంత బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ పక్క తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు నిర్వహిస్తూనే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ 17 వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటన కూడా వచ్చింది.
కానీ స్క్రిప్ట్ అయితే రెడీగా ఏమీ లేదు. ఇంకా ఐడియా డెవలప్ చేసే స్టేజిలోనే ఉంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది. రామ్ చరణ్ కి ఐడియా కూడా చెప్పలేదు సుకుమార్. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ దశలో ఉన్నప్పుడు.. రామరాజు లుక్లో ఒక ఫైట్ సీక్వెన్స్ తీసి పెట్టుకున్నాడు సుకుమార్. ఆ గెటప్ సుకుమార్ కు బాగా నచ్చిందట. దీంతో ఆ లుక్ లేదా ఆ ఫైట్ చూసి కథ డెవలప్ చేసుకోవాలని సుకుమార్ అనుకున్నాడు.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం, సుకుమార్ ‘రంగస్థలం 2’ ఐడియాకి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. దానిని డెవలప్ చేసిన తర్వాత చరణ్‌కు ఫస్ట్ డ్రాఫ్ట్ గా వినిపించనున్నారు సుకుమార్. దసరా తర్వాత చరణ్ ని కలిసి సుకుమార్ కథ వినిపించే అవకాశాలు ఉన్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే అదే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యే కంటెంట్ అందులో ఉంది. చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని కూడా అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడం.. ‘రంగస్థలం’ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.