బాలీవుడ్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ మూవీ ‘వార్ 2’ పెద్ద ప్రయోగంగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఎన్టీఆర్ స్టార్ డమ్ కి పెద్ద సవాలు విసిరింది వార్ 2. కమర్షియల్ గా ఏ మాత్రం సత్తా చాటలేకపోతుంది. హృతిక్ రోషన్ వంటి స్టార్ ఉన్నా నార్త్ లో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోతుంది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై మల్టీ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఆదిత్య చోప్రా.
బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ వరకు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా వీక్ డేస్ లో చేతులెత్తేసింది.దీంతో 2వ వీకెండ్ పై భారం ఎక్కువగానే పడింది అని చెప్పాలి. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 10.61 cr |
సీడెడ్ | 7.93 cr |
ఉత్తరాంధ్ర | 5.18 cr |
ఈస్ట్ | 2.83 cr |
వెస్ట్ | 1.99 cr |
గుంటూరు | 3.35 cr |
కృష్ణా | 2.66 cr |
నెల్లూరు | 1.66 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 36.21 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.31 cr |
ఓవర్సీస్ | 2.67 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 42.19(షేర్) |
‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.9 రోజుల్లో ఈ చిత్రం రూ.42.19 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.78.36 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.45.81 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకున్నా 50 శాతం రికవరీ కూడా కష్టంగానే కనిపిస్తుంది.