War 2 Trailer: అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘వార్ 2’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ బ్యానర్ అధినేతలు నిర్మిస్తున్నారు. ఆదిత్య చోప్రా కథతో శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు. ఆగస్టు 14న భారీ పోటీలో ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగవంశీ తెలుగులో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు.

 

War 2 Trailer

 

ఇక ఆల్రెడీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లింప్స్ వదిలారు. దానికి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ పై ట్రోల్స్ వచ్చాయి.డూప్ షాట్స్ ఎక్కువగా వాడారు అని.. అలాగే అందులో ‘హృతిక్ నే హైలెట్ చేశారు’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఉసూరుమన్నారు. బాలీవుడ్లో కొంత మంది నెటిజన్లు కూడా ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ ను తీసుకుని ట్రైలర్ ను బాగా కట్ చేశారేమో అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ‘వార్ 2’ ట్రైలర్ ను వదిలారు.

 

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 35 సెకన్లు నిడివి కలిగి ఉంది. ఇందులో ముందుగా కబీర్(హృతిక్ రోషన్) బ్యాక్ స్టోరీ పై హింట్ ఇచ్చారు. దేశం కోసం కుటుంబాన్ని, ప్రాణాన్ని, అవమానాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడతానని అతను చెబుతున్నాడు. ఇక మరోపక్క విక్రమ్(ఎన్టీఆర్) ఎవ్వరూ చేయని పనులు చేస్తానని, పాపం పుణ్యాన్ని లెక్కచేయకుండా దాటేస్తాను అని చెబుతున్నాడు. ఇలా 2 పాత్రలను పరిచయం చేశారు.

 

అయితే ఎన్టీఆర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అతను దేశ సేవ కోసమే చెడు మార్గాన్ని ఎంచుకున్నట్టు హింట్ ఇచ్చారు. ఇందులో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యాయి. హృతిక్ రోషన్ – కియారా అద్వానీ..ల లిప్ లాక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి మధ్య ఫైట్ సీన్ కూడా పెట్టారు. అయితే ట్రైలర్ లో కూడా ఎన్టీఆర్ గొంతు బొంగురుగా ఉన్నట్టు గమనించవచ్చు. చివర్లో ఎన్టీఆర్, హృతిక్..ల మధ్య ఫైట్ ను కూడా హైలెట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన డేట్.. ‘హరిహర వీరమల్లు’ సంగతేంటో?

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus