‘జబర్దస్త్’ లో గడవలు నిజమేనా??

  • July 25, 2016 / 08:50 AM IST

ప్రముఖ ఛానెల్ ఈటీవీ, మల్లెమాల ఎంటర్‌టేన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘జబర్దస్త్’ ఖాతర్నాక్ కామిడీ షో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ షో కి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. అదే క్రమంలో ఆ షో లో కొత్త కొత్త పర్టిసిపెంట్స్  సూపర్ కామెడీని పండిస్తూ అందరినీ అలరిస్తున్నారు.

ఇక ఈ కధ అంతా పక్కన పెడితే….ఆ షో లో ఇద్దరి మధ్య గడవలు పెరిగాయని, అందుకే వారిద్దరినీ విడగొట్టి సెపరేట్ టీమ్స్ గా చేశారని  వార్తలు వినిపిస్తున్నాయి…విషయంలోకి వెళితే….జబర్దస్థ్ టీంలో ఇదవరకు ఒకే టీంలో ఉన్న రాకింగ్ రాకేష్, కిరాక్ ఆర్పి ఇప్పుడు రెండు టీంలుగా విడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య గొడవల వల్లే రెండు టీములు గా డివైడ్ చేయాల్సి వచ్చిందని టాక్ బలంగా వినిపిస్తుంది.

అంతేకాకుండా మరో పక్క రాకేష్, ఆర్పిల మధ్య గొడవలకు కారణాలు కూడా ఇద్దరి మధ్య రెమ్యునరేషన్ కారణాలని పైకి చెబుతున్నా రాకేష్, ఆర్పిల ఈగో ప్రోబ్లంస్ వల్లనే ఇలా విడి విడిగా టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్నారు అని తెలుస్తుంది. ఇక మరో పక్క ఈ ఇద్దరూ తమ టీమ్స్ తో సూపర్ కామెడీని పండిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా..ప్రేక్షకులను ఎంటర్‌టేన్ చెయ్యాల్సిన వాళ్ళు అలా ఈగో ప్రాబ్లమ్స్ తో ఇలా విడిపోవడం చాల్ విచారకరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus