బాలయ్య…నాగ్ మధ్య విభేదాలున్నాయా??

టాలీవుడ్ కు రెండు కళ్లుగా మెలిగినటువంటి ఎన్టీఆర్, నాగేశ్వరరావు మధ్య అప్పట్లో విభేదాలు ఉన్న మాట అందరికీ తెలిసిందే. అయితే కొంత కాలం వారిరువురు మాట్లాడుకోనప్పటికీ…ఆ తరువాత మళ్ళీ కలసిపోయి ఒకరికోసం ఒకరు అన్నట్లుగా మెలిగారు. ఇదిలా ఉంటే వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ- నాగ్ సైతం ప్రత్యక్షంగా విరోధం లేకపోయినా ఒకరికి ఒకరు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

వారిరువురి మధ్య విభేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. బహుశా ఆ కారణం చేతనే…అక్కినేని చనిపోయినప్పుడు కనీసం బాలకృష్ణ నాగార్జునను పరామర్శించడానికి కూడ రాలేదు అన్న వార్త అప్పట్లో టాలీవుడ్  లో హల్‌చల్ చేసింది. ఇక తాజాగా బాలయ్య 100వ సినిమాలో సైతం దాదాపుగా అతిరధమాహారధులు అందరూ కనిపించారు కానీ, నాగ్ మాత్రం కనిపించలేదు. అయితే..దానికి గల కారణం ఏంటి అంటే…కొందరేమో ఆసకు బాలయ్య నుంచి నాగ్ కు పిలుపు అందలేదు అని అంటున్నారు. మరి కొందరు…బాలయ్య పిలిచాడు కానీ నాగ్ రాలేదు అని అంటున్నారు. అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా నాగ్ ఒక సరికొత్త ప్రణాళికను సిద్దం చేసుకున్నాడని…అదేంటి అంటే…శుక్రవారం  ఆశ్చర్యకరంగా ఉన్నట్లుండి నాగచైతన్య కొత్త సినిమాను తన అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించాడు. చైతూ అందుబాటులో లేకున్నా నాగార్జునే స్వయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈసినిమా ఎటువంటి హడావిడి లేకుండా సరిగ్గా బాలకృష్ణ తన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రారంభం జరుగుతున్న సమయంలోనే నాగ్ తన కొడుకు సినిమాను ప్రారంభించాడు. మరి నాగ్ ఇదంతా కావాలనే చేశాడా…లేక కుదరక బాలయ్య వేడుకకు రాలేకపోయాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus