శత్రువులుగా మారనున్న మిత్రులు.. కారణం ఆ దర్శకుడే?

ఎన్టీఆర్, మంచు మనోజ్ .. లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ‘చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ ను ఓ వ్యక్తి విమర్శిస్తే అతని చెయ్యి విరగొట్టినట్టు’ కూడా మనోజ్ చెప్పుకొచ్చాడు. ‘ఎన్టీఆర్ నా ప్రాణం’ అంటూ తన ట్విటర్లో అనేక సార్లు చెప్పుకొచ్చాడు మనోజ్. అంతేకాదు.. ఎన్టీఆర్ నాన్నగారు అయిన దివంగత హరికృష్ణ గారు అంత్యక్రియలలో భాగంగా ఎన్టీఆర్ రోడ్డు పై వెళ్తున్నప్పుడు.. ఆ సమయంలో కూడా జనం అతని మీదికి వచ్చేస్తుంటే..

మనోజ్ ఓ బౌన్సర్ లా మారి వాళ్ళను కంట్రోల్ చేసాడు. అంతటి గొప్ప స్నేహితులైన ఎన్టీఆర్, మనోజ్ లు.. ఇప్పుడు శత్రువులుగా మారబోతున్నారనే వార్త ఊపందుకుంది. దానికి కారణం ఓ దర్శకుడని కూడా తెలుస్తుంది. కంగారు పడకండి.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ ను తీసుకున్నాడట త్రివిక్రమ్. తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడంతో..

రెండేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు మనోజ్. ఇక డిప్రెషన్ నుండీ కోలుకున్నాక.. తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజముందనేది నిర్మాతలు అధికారిక ప్రకటన ఇస్తేనే కానీ చెప్పలేం..!

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus