బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ సెషన్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓ బేబీ అనే టాస్క్ పార్టిసిపెంట్స్ మద్యలో చిచ్చు పెట్టింది. ముఖ్యంగా లాస్ట్ వరకూ ఉన్న శివాజీ – అర్జున్ – గౌతమ్ మద్యలో గేమ్ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ శివాజీ చాలా తెలివిగా ఫాస్ట్ గా పరిగెత్తి మరీ గౌతమ్ బొమ్మని పట్టుకున్నాడు. అర్జున్ శివాజీ బొమ్మని తీసుకుని బేబీ కేర్ సెంటర్లో పెట్టేందుకు వెళ్లాడు. ఇక మిగిలిన అర్జున్ బొమ్మని గౌతమ్ పట్టుకోవాల్సి వచ్చింది.
ఇక శివాజీ స్ట్రాటజీకి గౌతమ్ షాక్ అయ్యాడు. దీంతో గౌతమ్ రేస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. అర్జున్ – శివాజీ ఇద్దరూ కూడా కెప్టెన్సీ కోసం ఫైనల్ గా మిగిలారు. అయితే, ఇక్కడ శివాజీ లాస్ట్ లో అర్జున్ కోసం కావాలంటే ఆగిపోతా అంటూ మాట్లాడాడు. దీనికి గౌతమ్ కి కాలింది. మాకోసం ఎందుకు చేయలేదంటూ అడిగాడు. ఎప్పుడు నాకు అన్యాయం జరిగిందని అనిపిస్తే అరుస్తా అంటూ మాట్లాడాడు. ఇద్దరి మద్యలో మాటల యుద్ధం అయ్యింది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ బరెస్ట్ అయ్యారు. నువ్వెంత అంటే నువ్వెంత్ అని మాట్లాడుకున్నారు.
నేను బిగ్ బాస్ కి గాడిదలు కాయడానికి వచ్చానా అంటూ శివాజీ అంటే, నేను గాడిదలు కాయడానికి వచ్చానా అంటూ గౌతమ్ అన్నాడు. నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావ్ అంటూ శివాజీ అన్నాడు. కావాలని కాదు అని, నాకు అన్యాయం జరిగినపుడు మాట్లాడకపోతే ఎలా అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. కంటెంట్ కోసం, సీన్ చేయడం కోసం అరవద్దంటూ శివాజీ రెచ్చిపోయాడు. ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అంటూ రంకెలేస్తూ గౌతమ్ పై విరుచుకుపడ్డాడు. దీంతో గౌతమ్ కూడా బరెస్ట్ అయి శివాజీ పై అరిచాడు. పైనల్ గా గేట్ తీయ్ బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) నేను వెళ్లిపోతా., అంటూ మాట్లాడాడు.
దీంతో మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. శివాజీ ఆటలో స్ట్రాటజీ వాడినా కూడా గౌతమ్ తన పాయింట్ లో అరవడం అనేది హౌస్ మేట్స్ మాట్లాడకుండా చేసింది. అంతేకాదు, గౌతమ్ గట్టిగట్టిగా అరుస్తుంటే ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నిజానికి శివాజీ ఎప్పుడూ కూడా జెన్యూన్ గా గేమ్ ఆడతా అంటూ మాట్లాడతాడు. కానీ ఇప్పుడు స్ట్రాటజీ ప్లే చేసి కావాలనే గౌతమ్ బొమ్మని పట్టుకున్నాడు. అందుకే, గౌతమ్ కి కోపం వచ్చింది. అంతేకాదు, అక్కడ అర్జున్ కోసం కావాలంటే నేను ఆగిపోతా అన్నాడు అందుకే గౌతమ్ అరిచాడు.
ఇక్కడ గౌతమ్ అరవడంలో పాయింట్ ఉన్నా కూడా శివాజీ చాలా స్ట్రాటజీగా గేమ్ లో బాగా ఆడాడు. అందుకే, కావాలనే శివాజీ అలా చేశాడని చెప్పి గౌతమ్ అరిచాడు. గౌతమ్ నాకు అన్యాయం జరిగింటూ రెచ్చిపోయాడు. ఈ గేమ్ లో అమర్ కూడా తన స్ట్రాటజీని ఉపయోగించి ఫస్ట్ రౌండ్ లో ప్రశాంత్ ని , ఆ తర్వాత యావర్ ని అవుట్ చేశాడు. దీంతో యావర్ కి అమర్ కి కూడా ఈ టాస్క్ లో గొడవ అయ్యింది. మొత్తానికి ఈ బేబీ టాస్క్ అనేది హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు పెట్టిందన్నమాట. అదీ మేటర్.