బిగ్ బాస్ హౌస్ లో నాన్ స్టాప్ టాస్క్ లు కంటిన్యూగా వస్తునే ఉన్నాయి. ఇందులో భాగంగా రోటీ , కపడా, మఖాన్ అంటూ బిగ్ బాస్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ కి టాస్క్ ఇచ్చాడు. ఇందులో వారియర్స్ గెలిస్తే హౌస్ లో వాళ్లు కోల్పోయిన యాక్సెస్ ని తిరిగి పొందచ్చు. ఈ టాస్క్ లలో రెండుసార్లు ఛాలెంజర్స్ గెలిచారు. మూడో టాస్క్ లోనే అసలు మాజా వచ్చింది. గార్డెన్ ఏరియాలో బాస్కెట్ బాల్ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. 5 పాయింట్స్, 10 పాయింట్స్, 20 పాయింట్స్ లైన్లని ఉంచారు.
ఇందులో రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. జూనియర్స్ నుంచీ కేవలం 5పాయింట్స్ లైన్ పైనుంచీ అనిల్ మాత్రమే బాస్కెట్ లో బాల్ వేశాడు. ఇక సీనియర్స్ నుంచీ కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే 5 పాయింట్స్ సాధించారు. ఇద్దరిమద్యలో మ్యాచ్ టై గా ముగిసింది. ఇందులో సంచాలక్ గా హమీదా, ఇంకా శ్రీరాపక ఇద్దరూ ఈగేమ్ లో సంచాలక్ గా వ్యవహరించారు.ఇక ఇద్దరూ కలుపుకుని అందరికీ మరో ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు.
కానీ, బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కేవలం ఒకరు మాత్రమే సూపర్ త్రో చేయాలని, పాయింట్ సాధించి లీడ్ వచ్చేవరకూ చేయాల్సి ఉంటుందని అన్నాడు. దీంతో వారియర్స్ టీమ్ నుంచీ వచ్చిన తేజస్వి ఫస్ట్ బాల్ ని బాస్కెట్ లో వేసేసింది. ఆ తర్వాత అనిల్ రెండు బాల్స్ వేయలేకపోయాడు. దీంతో వారియర్స్ ఈ టాస్క్ లో విజయం సాధించి ఒక పాయింట్ పొందారు. ఈ పాయింట్ తో వాళ్లు హౌస్ లో లగేజ్ యాక్సెస్ ని సంపాదించారు.
కానీ, రెండు టాస్క్ లలో ఓడిపోయి కొన్ని యాక్సెస్ లని పొందలేకపోయారు. ఇందులో ఏది మిస్ అయ్యిందనేది చూపించలేదు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఈ టాస్క్ లో గట్టి ట్విస్ట్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నాడు. ఈ టాస్క్ అయిన తర్వాత హమీదా కి నటరాజ్ మాస్టర్ కి చిన్న ఆర్గ్యూమెంట్ జరిగింది. ఈ టాస్క్ అయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అదీ మేటర్.