Raj Kundra, Shilpa Shetty: రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి విడాకులు తీసుకోబోతున్నారా..ఆ పోస్ట్ కు అర్ధమేంటి?

  • October 20, 2023 / 05:49 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాజ్ కుంద్రా శిల్పా శెట్టి దంపతులు ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనగా మారింది. అయితే ఈ వార్త వైరల్ గా మారడానికి కారణం లేకపోలేదు సోషల్ మీడియా వేదికగా రాజ్ కుంద్రా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మేము విడిపోయాం

ఈ కష్ట సమయంలో ఈ బాధ నుంచి బయటపడటానికి కొంత సమయం ఇవ్వండి అని రాయడమే కాకుండా రెండు చేతులను జోడిస్తూ నమస్కరిస్తున్నటువంటి ఎమోజితో పాటు హార్ట్ బ్రేక్ అయినటువంటి ఎమోజిని కూడా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అదేంటి ఎంతో అన్యోన్యంగా ఉండే శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులు ఇలా విడిపోవడానికి కారణం ఏంటి మొన్నటి వరకు ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా ఉన్నారు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు సంవత్సరాల క్రితం రాజ్ కుంద్రా ఫోర్న్ సినిమాలు చేస్తారంటూ ఆరోపణలు ఎదుర్కొని ఈయన జైలు పాలైన విషయం మనకు తెలిసిందే. అలాంటి సమయంలో కూడా శిల్పా శెట్టి ఆయన నుంచి విడిపోవడానికి ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకున్నారన్న విషయం గురించి కూడా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ పోస్ట్ పై స్పందిస్తూ విడిపోవాలనుకుంటున్నది శిల్ప శెట్టితో కాదని ఆయన ఇన్ని రోజులు బయటకు వెళ్లిన మాస్క్ వేసుకుని వెళ్తున్నారు.

ఈ కేసు విషయంలో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి (Raj Kundra) ఈయన మీడియాకి మొహం చూపించకుండా ఏదో ఒక మాస్క్ వేసుకొని బయటకు వస్తున్నారు అయితే ఇప్పుడు ఆ మాస్క్ నుంచి తాను విడిపోతున్నానని ఈ సందర్భంగా రాజ్ కుంద్రా చెప్పారంటూ పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈయన ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus