ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను నిద్ర లేకుండా చేసిన ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మహిష్మతి రాజ్యంలోని యువరాజులు మధ్య పోరాటాన్ని తెరపైన మరోమారు చూడనున్నాం. ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేసిన బాహుబలి 2 రేపు ఎనిమిది వేల థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రాజమౌళి తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఇందులో ఆసక్తికర విషయం చెప్పారు. బాహుబలి అనగానే పోరాటాలు, డ్రామా మాత్రమే గుర్తుకొస్తాయి. అవి బాహుబలి 2 లో ఊహించనట్లుగా ఉంటాయి.
ఇంకా హాస్యం కూడా ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. జక్కన్న సెంటిమెంట్ ని పండించడంలో దిట్ట. డ్రామాని, మెలోడ్రామాని అద్భుతంగా తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. కామెడీని అనవసరంగా జొప్పించారు. కథలో భాగంగానే కామెడీ సీన్లు వస్తాయి. మరి ఈ చిత్రంలో ఎక్కడ, ఎవరి మధ్య హాస్యం పండించారనే విషయం ఆసక్తిని కలిగించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.