దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ విడుదలైన వారం రోజుల్లో 800 కోట్లు కొల్లగొట్టి కనక వర్షం కురిపిస్తుంటే … నష్టాలను మిగిల్చింది అని అంటారేంటి అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. బాహుబలి 2 ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిన మాట వాస్తవమే. కానీ బాహుబలి బిగినింగ్ మాత్రం బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచి నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చిందంట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చెప్పారు. ఈయన బాహుబలి తెలుగు వెర్షన్ కి సమర్పకునిగా వ్యవహరించారు.
బాహుబలి పార్ట్ 1 నిర్మాణ సమయంలో నెగిటివ్ టాక్ రావడంతో, సినిమాను తీసుకునేందుకు బయ్యర్లు భయపడ్డారని, అందువల్ల ఆ సినిమాను నిర్మాణ వ్యయం కంటే తక్కువ ధరకు ఇచ్చేయాల్సి వచ్చిన సంగతిని ఇప్పుడు బయటపెట్టారు. ఆ మూవీ అందరికీ నచ్చి 600 కోట్లు వసూలు చేసి బయ్యర్స్ కి లాభాలను అందించిందని వెల్లడించారు. అయితే పార్ట్ 2 కి మాత్రం మొదటి నుంచి క్రేజ్ ఉండడంతో నిర్మాతలు లాభాలను అందుకున్నట్లు రాఘవేంద్రరావు వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.