Srihari: సినిమాల్లో ఛాన్స్ లేక చివరికి అలాంటి పనులకు సిద్ధమైయారా..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొంతమంది నటీనటులను ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు చేసిన పాత్రలు అలాంటివి. బౌతికంగా వాళ్ళు మన మధ్య లేకపోవడం అనేది మనం చేసుకున్న దురదృష్టం. ఆయా హీరోలు నటించిన పాత సినిమాలు చూసుకుంటూ వాళ్ళు ఇంకా మనతోనే ఉన్నారు అనుకుంటూ బ్రతికేయడమే. అలాంటి మహానటులలో ఒకరు రియల్ స్టార్ శ్రీహరి. క్యారక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీహరి, ఆ తర్వాత హీరో గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు.

చిన్న నిర్మాతలకు శ్రీహరి (Srihari) ఒక బంగారు గని లాంటి వాడని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు , ఎందుకంటే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అప్పట్లో లాభాలను తెచ్చిపెట్టేవి. ఒక సెక్షన్ మాస్ ఆడియన్స్ ని ఆ రేంజ్ లో థియేటర్స్ రప్పించేవాడు ఆయన ఆరోజుల్లో. అయితే హీరో గా క్రేజ్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రాణించాడు. నేడు శ్రీహరి బ్రతికి ఉంది ఉంటే ‘బాహుబలి‘ సిరీస్ లో కతప్ప పాత్ర ఆయనకే దక్కి ఉండేది.

అలా ఎన్నో లెజండరీ పాత్రలను చేస్తూ ఇండస్ట్రీ లో రియల్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ శ్రీహరి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. శ్రీహరి మొదటి కొడుకు మేఘాంశ్ ‘రాజదూత్’ అనే చిత్రం ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, ఇక అప్పటి నుండి ఈయనని ఇండస్ట్రీ పట్టించుకోవడమే మానేసింది. అదే శ్రీహరి నేడు జీవించి ఉంటే ఆయన కొడుకు ఇలా అయితే ఉండేవాడు కాదు, కచ్చితంగా ఉన్నత స్థాయిలోనే ఉండేవాడని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ కొడుకులము అని చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది కంటే మేఘాంశ్ ఏంటో బెటర్ అని చెప్పొచ్చు. కానీ అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు , దేనికైనా లక్ కలిసి రావాలి అని ఇందుకే అంటూ ఉంటారు. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపొయ్యేసరికి శ్రీహరి ఇద్దరు కొడుకులు కూడా బ్రతుకు తెరువు కోసం ఐటీ రంగం లో ఉద్యోగాలు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus