మంచి యాక్టర్ అవుతాడనుకొంటే.. ఇలా అయిపోయాడేంటి!

కొణిదెల, నందమూరి, అక్కినేని కుటుంబాల నుండి నట వారసులు వస్తూనే ఉన్నారు. ఇంకా ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కూడా. కానీ.. ఘట్టమనేని కుటుంబం నుంచి మాత్రం మహేష్ బాబు సరైన వారసుడు మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీకి రాలేదు. సుధీర్ బాబు ఇప్పటికీ కథానాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ఆమధ్య “నందిని నర్సింగ్ హోమ్” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ నిర్మల మనవడు, సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ పెర్ఫార్మెన్స్ చూసి మంచి నటుడు అవుతాడు అనుకొన్నారు అందరు.

కానీ.. “నందిని నర్సింగ్ హోమ్” విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా నవీన్ నటించిన మరో సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన “ఊరంతా అనుకొంటున్నారు” సినిమా విడుదలైనట్లు కనీసం ఊర్లో సగం మందికి కూడా తెలియదు. ఇక రిజల్ట్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనుకోండి. అయితే.. జయాపజయాలతో సంబంధం లేకుండా నవీన్ ను ఇటీవల చూసిన జనాలందరూ షాక్ కు గురయ్యారు. మనిషి మరీ గుర్తుపట్టలేనంత లావుగా తయారయ్యాడు. దాంతో.. ఈ అబ్బాయి ఏంటీ నారా రోహిత్ కంటే లావుగా అయిపోయాడు అని కామెంట్స్ వినిపించాయి. మరి యాక్టింగ్ కెరీర్ మీద ఇంట్రెస్ట్ లేదా అని ప్రశ్నలు కూడా వినవచ్చాయి. మరి నవీన్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకొంటున్నాడో చూడాలి.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus